ఏపీ కేబినెట్ భేటీ.. ఐదు సంతకాలకు ఆమోదం

అమరావతిలో రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలిసారి కూటమి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు అటెండయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

మెగా DSC తో 16 వేల 347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్ 4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్దరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై కేబినెట్ లో డిస్కస్ చేశారు. జులై ఫస్ట్ నుంచి డీఎస్సీ ప్రక్రియను మొదలుపెట్టి డిసెంబర్ 10 లోపు పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళిక రెడీ చేశారు. 

జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి దగ్గరికే వెళ్లి ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారం గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7 వేలు ఇవ్వనున్నారు. ఏపీలో 65 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు.