గుడ్ న్యూస్: రాష్ట్రంలో కొత్తగా 2,774 రేషన్ షాపులు.. కేబినెట్ కీలక నిర్ణయం

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్భంగా మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 2777 రేషన్ షాపుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సెబ్ రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. అధికారంలోకి రాగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరుతో ముద్రించబడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్.. 

Also Read :- జపాన్ లో బియ్యం లేవు.. ఎందుకంటే..?

ప్రభుత్వ చిహ్నాం రాజముద్రతో కూడిన 21.86 లక్షల కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయాలని డిసైడ్ అయ్యింది. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివాదస్పద భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 77 లక్షల సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగింపునకు పచ్చ జెండా ఊపింది. 22ఏ జాబితాలోని భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.