అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. కొత్త మద్యం పాలసీ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. కొత్త మద్యం పాలసీని రేపు ( సెప్టెంబర్ 18, 2024 ) కేబినెట్ ముందుపెడతామని తెలిపింది మంత్రివర్గ ఉపసంఘం.
Also read:-జగన్ మళ్లీ సీఎం అయ్యే వరకు గణేష్ నిమజ్జనం చేయం
గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారని, మద్యం ధరలు పెరగడంతో పేదలు గంజాయికి అలవాటుపడ్డారని పేర్కొంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని మీడియా సమావేశంలో తెలిపింది మంత్రివర్గ ఉపసంఘం. ఈ మీడియా సమావేశంలో ఏక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు నాదెండ్ల మనోహర్, సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.