ఏపీ పోలింగ్ ఆఫీసర్లపై ఈసీ విచారణ

ఏపీ పోలింగ్ ఆఫీసర్లపై ఈసీ విచారణ

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన లోక్ సభ, శాసన సభ ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించని అధికారులపై విచారణ కొనసాగుతుంది. నెల్లూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జరిగిన నాలుగు ఘటనలకు గాను విచారణ చేపట్టింది ఈసీ. ఇందుకు పలు అధికారులపై వేటు వేయడానికి సిద్ధమయ్యారు. పోలింగ్ తర్వాత తలెత్తిన గొడవల్లో ఎన్నికల అధికారుల వైఫల్యం ఉన్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ కు సమాచారం అందడంతో… మూడు జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు.దీంతో పాటే.. రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల పై చర్యలు తీసుకునేందుకు ఈసీకి ద్వివేది సిఫారసు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ద్వివేది.. ఈవీఎంల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలను కదిలించొద్దని చెప్పారు.