ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..

2024 సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్ తేదికి మరో ఆరురోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి చర్యలు జరగకుండా ఈసీ గట్టి నిఘా పెట్టినప్పటికీ నెట్లను యూపీఐ ద్వారా నగదు పంపిణీ చేస్తున్నట్లు ఈసీ గుర్తించింది.

ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. నగదు తీసుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒంగోలులో యూపీఐ ద్వారా ఉద్యోగులకు నగదు పంపిణీ చేస్తున్న కొంతమందిని గుర్తించామని, దీనిపై విచారణ చేస్తున్నామని, కాల్ డేటా రికార్డ్, బ్యాంకు అకౌంట్లను పరిశీలించి నగదు తీసుకున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని అన్నారు సీఈఓ మీనా.