ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో 144సెక్షన్ అమల్లోకి రావటంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక హెచ్చరికలు జారీ చేశారు. కొంతమంది ఇంటివద్దనే వేళ్ళపై సిరా మార్కు వేస్తున్నట్లుగా సోషల మీడియాలో వార్తలొస్తున్న నేపథ్యంలో మీనా ఈ హెచ్చరికలు జారీ చేశారు.
ప్రభుత్వం మాత్రమే చెరగని సిరా తయారు చేస్తుందని అది ఈసీ వద్దనే అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు సమాచారం అని, ఎవరైనా ఇతర సిరాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు ముకేశ్ కుమార్ మీనా.