Ram Gopal Varma: ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన వర్మ

Ram Gopal Varma: ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు..  హైకోర్టును ఆశ్రయించిన వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 2019 లో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై నమోదైన కేసులకు సంబంధించి వర్మకు ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) మరోసారి నోటీసులు జారీ చేసింది.

విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గతంలోనే అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలులో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్జీవీని విచారణకు రావాలని తాజాగా సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. దాంతో సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు.

ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి ఒంగోలులో విచారణను హాజరయ్యాడు ఆర్జీవీ. ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సినిమా తీసాడని.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అవ్వడంతో విచారణను ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పుడు ఈ తాజా కేసుతో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాడో అనే ఆసక్తి నెలకొంది.