
రామ్ పోతినేని హీరోగా 'మిస్ శెట్టి 'మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ పి మహేష్ బాబు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ కెరీర్లో ఇది 22వ సినిమా 'ర్యాపో 22' వర్కింగ్ టైటిల్ తో దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తవగా, ఇటీవల రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ మొదలైంది. అక్కడ జరుగ తున్న షూటింగ్‌కి ఏపీ సినిమాటోగ్రఫీ. టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెళ్లి. రామ్ తోపాటు టీమ్‌ని కలిసి ముచ్చటించారు.
సుమారు గంట సేపు సెట్ లో ఉన్న ఆయన.. రామ్ డ్యాన్సులు తనకు ఇష్టమని తెలిపారు. ఏపీలో మంచి పర్యా టక ప్రాంతాలు ఉన్నాయని, గోదావరి నదీ తీర ప్రాంతాల్లో చిత్రీకరణలు చేసిన చిత్రాలు ఘనవిజయాలు సాధించాయని ఈ సినిమా కూడా సక్సెస్ సాధించాలని టీమ్ ను విష్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్. మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో నే టైటిల్ అనౌన్స్ చేయనున్నారు.