ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటి... అసలు విషయం ఏంటంటే..

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే  పద్మావతి నేడు అమరావతి లో ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఇవాళ(సెప్టెంబర్ 12)  విజయవాడకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెళ్లారు. ఈ తరుణంలోనే..  ఏపీ సిఎం చంద్రబాబు తో భేటీ కానున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

అయితే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశం మర్యాద పూర్వకమైనది అని చెబుతున్నారు. కానీ వాస్తవం అది కాదని సమాచారం. తన చిన్న నాటి మిత్రుడిని పరామర్శించేందుకు విజయవాడకు  తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ..దంపతులు వెళ్లారని సమాచారం . 

ఈ క్రమంలోనే ఇరువురి పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో వరద ప్రభావంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ (Telangana) నీటిపారుదల అంశాలు, , ఇరు రాష్ట్రాల్లో వరద ప్రభావంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.ఇంకా  ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల గురించి చర్చించినట్లు సమాచారం. ఏది ఏమైనా వీరి సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంటోంది.