జమిలి ఎన్నికలు పెడితే నష్టమేంటి ? : సీఎం చంద్రబాబు

జమిలి ఎన్నికలు పెడితే నష్టమేంటి ? : సీఎం చంద్రబాబు

హైదరాబాద్: ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్..’ విధానంలో దేశం మొత్తం ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే నష్టం ఏంటని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. జమిలి ఎన్నికలు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత జరుగుతున్న చర్చలపై.. మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు పై విధంగా స్పందించారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే పాలనపై దృష్టి పెట్టొచ్చంటూ సమర్ధించారాయన. హర్యానా ఫలితాలపై కూడా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని, సుపరిపాలన వల్లే విజయం సాధించారని బాబు చెప్పారు. 

హర్యానా ఫలితాలపై చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..


* మోదీతో పాటు హర్యానా ప్రజలకు నా అభినందనలు
* హర్యానాలో విజయం ఎన్డీఏకు శుభసూచిక
* జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఓటుశాతం పెరిగింది
* విధ్వంస పాలనలో ఏపీ ఐదేళ్లుగా నష్టపోయింది
* మంచి చేసే ప్రభుత్వాలను ప్రజలు ఆదరిస్తారు
*  వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ ఉండాలి
* ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల వల్ల అభివృద్ధికి ఆటంకం
* ఏడుగురు కేంద్రమంత్రులను కలిశాం
* రాష్ట్ర అభివృద్ధికి కేంద్రసాయం అవసరం

ALSO READ | హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై.. జగన్ సంచలన కామెంట్స్