ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటి..

  • జలవనరులు, రైల్వేలైన్​ల గురించి చర్చ

  • ఐదు గ్రామాల విలీనం  ఆవశ్యకత గురించి వివరణ

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును ...తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా హైదరాబాద్​ లో కలిశారు. చంద్రబాబు నివాసంలోభేటి అయి పలు అంశాలపై చర్చించారు.రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు.. జలవనరులు ..రైల్వే లైన్ ల గురించి చర్చించారు.  ఇంకా పట్టిపీమ నుంచిప్రకాశం బ్యారేజ్ కు...పులిచింతల నాగార్జున సాగర్ కు గోదావరి జలాలు తరలించే విషయం భవిష్యత్తులో కీలకంగా మారుతుందన్నారు.....పట్టిసీమ టూ పులిచింతల లింక్ తో శ్రీశైలం నీళ్ళు రాయలసీమ సాగు నీటి కష్టాలు తీరి...తెలంగాణ కు మేలు జరుగుతుందనే విషయాన్ని ఏపీసీఎం చంద్రబాబు దృష్టికి తెలంగాణ మంత్రి తుమ్మల తీసుకొచ్చారు. ఇంకా సత్తుపల్లి టూ కోవూరు రైల్వే లైన్....పెనుబల్లి టూ కొండపల్లి రైల్వే లైన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరమని సూచించారు, కొత్తగూడెం టూ పెనుబల్లి రైల్వే లైన్ పూర్తయిందంటూ... . ఏపి లో రైల్వే పై దృష్టి పెట్టాలన్నారు. 

రైల్వే లైన్ తో.. బొగ్గు రవాణా, పుణ్య క్షేత్రాలు సందర్చించే భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇరు రాష్ట్రాలు సోదరులుగా  విడిపోయినా అభివృద్ధిలో కలసి సాగాలనే విధంగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. జలవివాదాల విషయంలో సమస్యలు.. గొడవలు  లేకుండా  తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగేందుకు చంద్రబాబు అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.జల వివాదాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగేందుకు చంద్రబాబు అనుభవం ఎంతో దోహదం చేస్తుంది..గతంలో ఆర్డినెన్స్​ ద్వారా ఏపీలోకలిపిన భద్రాచలం దగ్గరలోని భద్రాచలం ఐదు గ్రామాల విలీనం  ఆవశ్యకత గురించి  చంద్రబాబు కు మంత్రి తుమ్మల వివరించారు.