AP News: ఒకే వేదికపై చంద్రబాబు.. దగ్గుబాటి.. ఎమోషనల్​ గా హగ్​ చేసుకున్నారు

AP News: ఒకే వేదికపై చంద్రబాబు.. దగ్గుబాటి.. ఎమోషనల్​ గా హగ్​ చేసుకున్నారు

ఏపీ సీఎం చంద్రబాబు..  ఆయన తోడల్లుడు.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు..  దగ్గుబాటి పురంధేశ్వరి భర్త.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు  దాదపు 30 ఏళ్ల తరువాత ఓకే వేదికపైకి వచ్చారు. విశాఖ గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం 

గురువారం ( మార్చి6)  జరిగింది.ఒకే వేదికపై కలిసిన ఇద్దరు తోడల్లుళ్ళు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వేదికపై దగ్గుబాటి మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఆయనను ఎమోషనల్‌గా హగ్ చేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  కొన్నివేల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని, ప్రపంచ చరిత్రను పుస్తక రూపంలో తెలుగులో రచించడం అద్భుత ప్రయత్నం. చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలి. దగ్గుబాటి వెంకటేశ్వరావు పుస్తకం రాస్తారని నేను అనుకోలేదు. 

ALSO READ | తిరుమల అన్న ప్రసాదంలో భక్తులకు శెనగపప్పు గారెలు

స్వతహాగా రచయిత కానటువంటి రచయిత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎవరూ రాయని విధంగా పుస్తకాన్ని రాశారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ప్రతి ఇల్లు, ప్రతి లైబ్రరీలో ప్రపంచ చరిత్ర పుస్తకం ఉండాలి. సమయం దొరికినప్పుడు నేను కూడా ఈ పుస్తకం పూర్తిగా చదువుతాను. 

నాటి ఆచారాలు, ఆహారపు అలవాట్లు, వ్యవసాయం వంటి అంశాలను పుస్తకంలో పొందుపరిచారు.తన ప్రసంగంలో, వెంకటేశ్వరరావు గురించి ఆయన చెప్పిన అనేక ఆసక్తికరమైన విషయాలు, తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.