AP News: ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలి: సీఎం చంద్రబాబు

దేవుడి ఆచారాలు, సాంప్రదాయాలను ఎవరైనా గౌరవించి తీరాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేవుడు, ఆచారాల కంటే ఏ వ్యక్తి గొప్పకాదన్నారు. ఆలయ సాంప్రదాయాలను అందరూ గౌరవించాలన్నారు. తిరుమల లాంటి పుణ్యక్షేత్రం మనకు ఉండడం తెలుగువారి అదృష్టమన్నారు. ఏపీలో లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమల దర్శనానికి వెళ్లేందుకు సిద్దమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను అడ్డుకున్నారంటూ ఆయన చేసిన విమర్శల్ని  చంద్రబాబు తోసిపుచ్చారు. ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదన్నారు. తిరుపతిలో వైసీపీ నేతలు భారీ ర్యాలీలు తీస్తామంటే వద్దన్నట్లు తెలిపారు.

ALSO READ | నా మతం మానవత్వం.. ఇదే రాసుకోండి: జగన్

 శ్రీవారి మీద భక్తి ఉండే ఏ భక్తుడికైనా దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో వేరే మతాల వ్యక్తులుంటే అక్కడి సంప్రదాయాలు గౌరవించాలన్నారు. . ఇంతకు ముందు వెళ్లాను ఇప్పుడెందుకు వెళ్లకూడదని జగన్ అంటున్నారు. జగన్‌ అప్పుడు నిబంధనలు ధిక్కరించి తిరుమల వెళ్లారని గుర్తుచేశారు. గతంలో చాలా మంది డిక్లరేషన్‌ ఇచ్చి తిరుమల వెళ్లారు. అన్ని మతాలను గౌరవిస్తానన్న జగన్‌ తిరుమలలో ఎందుకు నిబంధనలు పాటించరు? అని చంద్రబాబు ప్రశ్నించారు.