ఏపీ సీఎం చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న తరువాత ఐఏఎస్, ఏపీఎస్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈసమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు తనను బాధించిందని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో సీఎంగా ఉన్నా... ప్రతిపక్ష నేతగా ఉన్నా ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇలాగా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు,. ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని సూచించారు. మరల శాఖల వారీగా ఐఏఎస్ , ఐపీఎస్ లతో సమావేశం అవుతానని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు సాయంత్రం సచివాలయంలో అడుగుపెట్టారు.. తన చాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఆ తర్వాత వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు.. అయితే, తొలిసారిగా సీఎం సచివాలయానికి రావడంతో.. ఆయన్ను కలిసేందుకు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్‌లు క్యూ కట్టారు.. వివాదస్పద అధికారులంతా సీఎం చంద్రబాబు కోసం ఫస్ట్ బ్లాక్ వైపు పరుగులు తీశారు..