ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డికి లేఖ రాశారు. విభజన హామీలపై కలిసి చర్చించుకొని పరిష్కారం దిశగా అడుగులేద్దామని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్నా కూడా సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై చర్చిద్దామని ఆహ్వానిస్తూ లేఖ రాశారు చంద్రబాబు.
జూలై 6న సాయంత్రం భేటీ అవుదామని లేఖలో పేర్కొన్నారు బాబు.ముఖాముఖీ కలిసి మాట్లాడుకుంటే ఎంతటి జఠిలమైన సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని, ఆ రకంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని చంద్రబాబు లేఖ రాశారు మరి, ఈ లేఖపై రేవంత్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి.