పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడుకు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, జగన్, కేటీఆర్‌..

పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడుకు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, జగన్, కేటీఆర్‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కుమారుడు చదువుతోన్న స్కూల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్కూల్లో మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదంలో.. మార్క్ శంకర్‌ చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, జనసేన శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి X వేదికగా స్పందించారు. " సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను" అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి X వేదికగా స్పందించారు. " సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయి. ఆయన త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని జగన్ X లో తెలిపాడు. 

ఏపీ మంత్రి నారా లోకేష్‌ Xలో స్పందిస్తూ.. ''సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. ఈ ప్రమాదంలో పవన్‌ కల్యాణ్‌ అన్నా కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఆయన త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి బలం చేకూర్చాలని పార్థిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌. 

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ X లో స్పందిస్తూ.. 'సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను' అంటూ కేటీఆర్‌ పోస్ట్ లో వెల్లడించాడు.

అలాగే, పవన్‌ కల్యాణ్‌ కుమారుడికి గాయాలపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించినట్లు సమాచారం.  8 ఏళ్ల మార్క్‌ శంకర్‌ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని చిరంజీవి తెలిపినట్లు తెలుస్తోంది.