హైదరాబాద్​నుఒక మోడల్​గా ఇచ్చా : సీఎం చంద్రబాబు

హైదరాబాద్​నుఒక మోడల్​గా ఇచ్చా  : సీఎం చంద్రబాబు

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్​ను ఒక మోడల్​గా 1995లో తాను ఇచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తెలంగాణలోనే అత్యధిక రెవెన్యూ సాధిస్తుందని తెలిపారు. హైదరాబాద్ సిటీ నివసించేందుకు ఎంతో అనువైన స్థలమని, గ్రీనరీ, రోడ్‌‌‌‌‌‌‌‌లు, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ ఇలా ఎన్నో ఇక్కడ ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్​కు కేవలం 9 నెలల్లోనే కృష్ణా వాటర్​ను తెచ్చామని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

లిక్కర్ కుంభకోణం అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ అనేది ఫెల్యూర్‌‌‌‌‌‌‌‌ అని విమర్శించారు. ఢిల్లీలో ఉన్న యమునా నది సమస్యను పదేండ్లుగా ఆప్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని ఫైర్ అయ్యారు.