ఏపీలో 20 హైదరాబాద్‌‌లు తయారు చేస్తా: చంద్రబాబు

 

అమరావతి, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌‌లో 20 హైదరాబాద్‌‌లను తయారు చేస్తానని  సీఎం చంద్రబాబు ప్రకటిం-చారు. నంద్యా లను జిల్లా చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణను తానే తయారు చేశానన్నారు. ఏపీకి ఏసమస్యలు లేవని, ఉన్న సమస్యల్లా జగనేనని విమర్శించారు. వైఎస్సార్‌‌సీ పీ, బీజేపీ ‘ఇంట్లో కాపురం బయట నాటకం’ చేస్తాయని నిప్పులు చెరిగారు.మోడీ, కేసీఆర్, జగన్ పేర్లతో ముగ్గురు దుర్మార్గు లు తమ మధ్య ఉన్నారని.. వాళ్లను ఫినిష్‌‌ చేస్తానని ధ్వ-జమెత్తా రు. మంగళవారం కర్నూలు, కడపల్లో బాబు ఎన్నికల ప్రచారం చేశారు. ‘ఆంధ్రులను తెలంగాణసీఎం కేసీఆర్‌‌ ఇష్టమొచ్చినట్లు తిట్టారు. ఏపీ వాటా ఇచ్చేందకు ససేమిరా అంటున్నారు. పోలవరంకట్టొద్దని సుప్రీంకోర్టులో కేసులేశారు. అలాంటివ్యక్తికి జగన్‌‌ ఎలా మద్దతిస్తారు. ఆయనకు సిగ్గుంటేకేసీఆర్‌‌ పక్కన ఎలా చేరతారు’ అని మండి పడ్డారు.జగన్‌‌కు కేసీఆర్‌‌ను చూస్తే భయమని, అందుకేఆయన కాళ్లు పట్టుకుంటా రని విమర్శించారు. తననుచూస్తే పారిశ్రామికవేత్తలు వస్తారని, జగన్‌‌ను చూస్తేపారిపోతారని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఓటు ద్వారాప్రజలిచ్చే తీర్పుతో కేసీఆర్‌‌ ఉలిక్కి పడి లేవాలన్నారు.వైఎస్సార్‌‌సీ పీని ఓడించి జగన్‌‌కు భవిష్యత్తు లేకుండాచేయాలన్నారు.

అందుకే మోడీకి నేనంటే కోపం

ముస్లిం ల పట్ల ప్రధాని మోడీ వివక్ష చూపుతున్నా-రని, వాళ్లకు భద్రత లేకుండా చేశారని బాబు ధ్వజ-మెత్తా రు. మోడీ హయాంలో హిందువులకో చట్టం ,ముస్లిం లకో చట్టం లా పరిస్థి తి తయారయిందనివిమర్శించారు. ‘గుజరాత్‌ లో ముస్లిం ల ఊచకోతవిషయంలో మోడీని తప్పిం చాలని మొదట నేనేడిమాండ్‌‌ చేశా. అందుకే నేనంటే ఆయనకు కోపం’అని బాబు చెప్పారు. ఏపీకి నమ్మక ద్రోహం చేసినమోడీ ఏ మొహం పెట్టుకుని కర్నూలు సభకు వస్తార-ని నిలదీశారు. టీడీపీ గెలుపుతో మోడీ గుండెల్లో రైళ్లుపరుగెత్తాలన్నారు. అధికారంలో కి రాగానే పెన్షన్లనురూ.3 వేలకు పెంచుతామని బాబు హామీ ఇచ్చారు.త్వరలోనే మహిళకు స్మార్ట్‌‌ ఫోన్లు అందజేస్తామనిచెప్పారు. విదేశీ విద్య కింద ఇచ్చే సాయాన్ని రూ.25ల-క్షలకు పెంచుతామన్నారు.

తెలివిగా ముం దే ఎన్ని కలు పెట్టుకున్నారు

‘‘కేసీఆర్  తెలివిగా ముందే ఎన్నికలు పెట్టుకుని 88స్థానా ల్లో గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే లనుడబ్బులిచ్చి కొంటూ ప్రజాస్వామ్యా న్ని అపహాస్యంచేస్తున్నారు. తప్పుదోవలో ఎమ్మెల్యే లను కొని మహాశక్తిమంతుడని అనుకుంటున్నారు. ఇప్పుడు అదే పద్ధ-తిలో మనపై దాడికి ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ 88సీట్లు గెలిస్తే నేను 150కి పైగా స్థానా ల్లో గెలుస్తా’’ననిబాబు అన్నారు.

జగన్‌ 1500 కోట్లు ఇస్తానన్నాడు: ఫరూక్‌‌

‘వైఎస్‌‌ మృతి తర్వాత తనను సీఎం చేస్తే రూ.1,500 కోట్ల ఇస్తానని కాంగ్రెస్ పార్టీకి జగన్‌‌ ఆఫర్‌‌ ఇచ్చారు. అంత డబ్బు ఆయనకు ఎక్కడిది? అలాంటి వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం దివాలా తీస్తుంది’ అని జమ్మూకాశ్మీ ర్ మాజీ సీఎం ఫరూక్‌‌ అబ్దుల్లా అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి రామమందిరం గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు.