హైదరాబాద్ కు చంద్రబాబు..భారీ ర్యాలీ... నగరం పసుపుమయం

ఏపీ సీఎంగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మొదటిసారి హైదరాబాద్ లో అడుగు పెట్టారు. శుక్రవారం ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు ఢిల్లీ నుండి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.ఏపీ సీఎం హోదాలో తొలిసారి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు తెలంగాణ టీడీపీ శ్రేణులు. విజయోత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు రాక సందర్బంగా హైదరాబాద్ లో భారీ ర్యాలీ ప్లాన్ చేశారు.

బేగంపేట విమానాశ్రయం నుండి బంజారాహిల్స్ లోని టీడీపీ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ ప్లాన్ చేశారు టీడీపీ శ్రేణులు. 500కార్లు, 150బైకులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.ఈ క్రమంలో హైదరాబాద్ రోడ్లన్నీ చంద్రబాబుకు స్వాగతం చెప్తూ వెలసిన ఫ్లెక్సీలు, బ్యానర్లతో పాసుపుమయంగా మారింది. బేగంపేట మొదలుకొని పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ వరకు దారిపొడవున పసుపు తోరణాలు, టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు తెలంగాణ టీడీపీ శ్రేణులు.