తిరుపతి తొక్కిసలాట : ఎస్పీ బదిలీ, డీఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు

తిరుపతిలో బుధవారం (08 జనవరి 2025) జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ పలువురు అధికారులను CM చంద్రబాబు సస్పెండ్ చేశారు. DSP రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి బాధ్యత లేకుండా పనిచేశారని, వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నా, వాళ్లు పనిచేయలేదని సీఎం చెప్పారు. అలాగే ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ ముఖ్య భద్రత అధికారి శ్రీధర్ ను వెంటనే ట్రాన్స్ఫన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

డీఎస్పీ అనాలోచితంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగిందని ప్రెస్ మీట్ సందర్భంగా తెలిపారు. డీఎస్పీ రమణ్ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని, కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. 

ALSO READ | పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి.. కలెక్టర్, టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

తిరుపతిలో జరిగిన ప్రమాదం బాధాకరమని సీఎం అన్నారు. ‘‘ సంఘటన జరిగిన దానికి బాదపడుతున్న..  ఛైర్మన్, ఈ.ఓలు సమన్వయంతో పనిచేయాలి.. దేవునికి అప్రతిష్ట చేస్తే  మంచిదికాదు.. మనస్సాక్షిగా పని చేయండి. పవిత్రమైన దివ్వ క్షేత్రంలో జరగకూడనిది జరిగింది. సంఘటన సైట్ దగ్గరికి వెళ్లాను డీటైల్ గా చూశాను.. ఆసుపత్రిలో అందరితో మాట్లాడాను.. దీనిపై ఆఫీసులో సమీక్ష చేశాను.. అన్నివిధాల, అన్నికోణాల్లో సమాచారం వుంది. ఛైర్మన్, ఈఓలకు చెబుతున్నా .. వ్వక్తిగత అసమర్ధత, అనాలోచిత నిర్ణయం వల్ల దేవుని పవిత్రతతను దెబ్వతీస్తే తప్పు.. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే..కలియుగ దేవునికి మనం సేవ చేస్తున్నాం.. జెరూసలెం  క్రిష్టియన్లకు, మక్కా ముస్లింలకు ఉన్నట్లుగానే.. హిందువులకు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలని వెళ్లాలనే కోరిక వుంటుంది. తిరుపతిలో టిక్కెట్స్ ఇవ్వటం కరెక్ట్ కాదు..  గడిచిన 4,5 ఏళ్ళుగా నడుస్తోంది. దేవుని లీలలు వింటూ భక్తులు అక్కడే గడుపుతారు. ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు కుదించి 10 రోజులు ఎందుకు చేసారో నాకు తెలీదు. దాని గురించి ఆగమ‌పండితులు డిసైడ్ చేస్తారు.. నేను ఆగమ పండితున్ని కాదు భక్తున్ని.  అన్ని దేవాలయాలను స్ట్రీమ్ లైస్ చేస్తాను. స్వామివారిపై భక్తి రోజురోజుకూ పెరుగుతోంది’’ అని ప్రెస్ మీట్ సందర్భంగా సీఎం అన్నారు.