గుంటూరు జిల్లా తాడేపల్లి(మ) పెనుమాకలోని ఎస్టీ కాలనీలో పాముల నాయక్ కుటుంబానికి సీఎం చంద్రబాబు తొలి పెన్షన్ అందించారు. పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, భార్యకు సీఆర్డీఏ పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ డబ్బులు అందజేశారు. వాళ్లు ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు కావాలని బాబును నాయక్ కుటుంబం కోరగా కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు ఏపీలో వృద్ధాప్య పింఛను రూ. 3 వేల పెన్షన్ ఉండగా..ఇపుడు 4 వేలకు పెంచారు. ఏప్రిల్ నుంచి అమలు చేస్తామన చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్, మే, జూన్ నెలల వెయ్యి కలిపి రూ.7 వేలు పంపిణీ చేశారు.