
పోలవరం ప్రాజెక్ట్ తన తండ్రి వైఎస్సార్ కల అని దానిని తన హాయంలోనే పూర్తి చేస్తానని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటేనే పోలవరమని అన్నారు. పోలవరం అని పలికే అర్హత కూడా టీడీపీ లేదన్నారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నోటి నుంచి ఒక్కసారి కూడా పోలవరం పేరు రాలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకు కదిలిందా అని ప్రశ్నించారు. టీడీపీ ద్యాసంతా డబ్బుల మీదనే అని విమర్శించారు. దాచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానమని , టీడీపీ ప్రభుత్వం నిధుల పారుదల మీదే దృష్టి పెట్టిందని ఆరోపించారు . పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం అన్న జగన్... ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారని తెలిపారు. పోలవరం పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జగన్ సభకు తెలిపారు. ల