హైదరాబాద్: నల్గొండ జిల్లా హుజుూర్ నగర్ లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్న కేసు కొట్టివేయాలని ఏపీ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో హుజూర్ నగర్ ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని జగన్ పై అభియోగాలు మోపుతూ అప్పట్లో కేసు నమోదు చేశారు.
ఈ కేసు విచారణకు హాజరు కావాలని ఇటీవల ప్రజా ప్రతినిధుల కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది. దీంతో ఏపీ సీఎం జగన్ కోర్టుకు హాజరు కావాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో ఏపీ సీఎం స్పందించి తెలంగాణ హైకోర్టులో కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు హుజూర్ నగర్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ ఏప్రిల్ 26కు వాయిదా వేస్తూ.. జగన్ హాజరుపై ఏప్రిల్ 26 వరకు స్టే ఇచ్చింది హైకోర్టు.
ఇవి కూడా చదవండి
సైంటిస్టుల కంటే రైతులకే బాగా తెలుసు
టీఆర్ఎస్ ఎంపీలకు కోమటి రెడ్డి సవాల్