ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ విజయవాడ మొగల్రాజపురం లోని టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్ లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. వార్త రాసే సమయానికి ( ఆగస్టు 21) గంటకు పైగా ల్యాబ్ లో ఉన్నారు. కాలి మడమ నొప్పితో సీఎంజగన్ బాధపడుతున్నారని... MRI మెడికల్ టెస్ట్ చేశారని సమాచారం అందుతోంది. అయితే ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
ఏపీ సీఎం జగన్ కొంతకాలంగా కాలి మడమ నొప్పితో బాధ పడుతున్నారు. గతంలోనే జనరల్ చెకప్ చేయించుకున్నారు. ఇటీవల సీఎం జగన్ వ్యాయాయం చేస్తున్న సందర్భంలో కాలు బెణికిందని సమాచారం అందుతోంది. అప్పడు . వెంటనే వైద్యులు వచ్చి చికిత్స చేశారు. విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గిపోతుందని వైద్యులు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన మడమనొప్పితో బాధ పడుతున్నారు.