
ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ఏపీ సీఎం వైయస్ జగన్. విజయవాడలో బుధవారం జరిగిన ‘ది హిందూ ఎక్స్ లెన్స్ ఇన్ ఎడ్యూకేషన్’ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. నిధుల కొరతతోనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. అమరావతి నిర్మాణానికి లక్షా 9 వేల కోట్లు అవసరమన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీ అని, అమరావతికి ఖర్చు చేసే నిధుల్లో కేవలం 10 శాతం ఖర్చు చేస్తే సరిపోతుందన్నారు. లెజిస్లేటివ్ కేపిటల్ గా అమరావతి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్న జగన్.. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు.
మరిన్ని వార్తలు
కరోనా ఎఫెక్ట్: భారత్ లో మూతపడుతున్న చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు
కొత్త కార్లతో జిల్‌జిగేల్…
కోఆపరేటివ్ బ్యాంకులకు కొత్త రూల్స్
ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేనేజర్ తో లేనని చెప్పించా
లాస్ ఏంజిలిస్లో మోసగాళ్లు
తెలంగాణ నుంచే ‘టాటా’కు ఎక్కువ ఆదాయం