
ఎన్నికల ఫలితాలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదన్నారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇంటికే తీసుకెళ్లే విధంగా మార్పులు తెచ్చామన్నారు. మహిళలకు సంక్షేమ పథకాలు అందించాం.. వారి ఓట్లు ఏమయ్యాయో తెలియదని సీఎం జగన్ అన్నారు. అవ్వా... తాతలు చూపించిన ఆప్యాయత ఏమయిందో తెలియదు... 66 లక్షల మంది పెన్షన్లు తీసుకున్నారు.. వారి ఓట్లు ఏమయ్యాయో తెలియదు.. 54 లక్షల రైతన్నలకు సాయం చేశాం.. 53 లక్షల మందికి అమ్మ ఒడి అందించాం.. అక్కా , చెల్లెమ్మల ఓట్లు ఓట్లు ఏమయ్యాయి.. గతంలో ఎప్పుడూ జరగని మంచి చేశామన్నారు. మంచి చేసినా ఓటమి పాలయ్యామన్నారు, కోట్ల మందికి మంచి చేసినా.. మ్యానిఫెస్టో అంటే ఒక బైబిల్.. ఖురాన్.. భగవద్గీత గా భావించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు.
గ్రామస్థాయిలోనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికీ సేవ చేసే కార్యక్రమాలను రూపొందించామన్నారు. విద్య, వైద్య, వ్యవసాయరంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. కోట్లమందికి మంచి చేసిన తరువాత వారు చూపించిన అభిమానం..ఆప్యాయత ఏమయిందో తెలియదన్నారు. అవినీతి లేకుండా 70 వేల లక్షల కోట్లను డీబీటీ ద్వారా అందించామన్నారు. అరకోటి మంది ప్రజల ఆప్యాయత ఏమయిందో తెలియదన్నారు. ఓడిపోయినా పేదవాడికి అండగా ఉంటానన్నారు.ప్రతిపక్షంలో ఉండటం .. పోరాటం చేయడం కొత్త కాదన్నారు. రాజకీయాల్లో కష్టాలు తనకు కొత్త కాదన్నారు.