![చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి మృతి](https://static.v6velugu.com/uploads/2024/11/ap-cm-nara-chandrababu-naidu-younger-brother-nara-rammurthy-naidu-72-passed-away_MfnjdEV1QS.jpg)
- గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లోచికిత్స పొందుతూ తుదిశ్వాస
హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు: ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు(72) మృతి చెందారు. ఈ నెల14న కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబసభ్యులు అతన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు కన్నుమూశారని ఏఐజీ మెడికల్ డైరెక్టర్ నవీన్చందర్రెడ్డి తెలిపారు.
రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే ఏపీ మంత్రి నారా లోకేశ్ విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని హైదరాబాద్కు వచ్చి తన సోదరుడికి నివాళులు అర్పించారు.