తారకరత్న మృతి పట్ల జగన్, పవన్ సంతాపం

తారకరత్న మృతి పట్ల జగన్, పవన్ సంతాపం

సీని నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల  ఏపీ సీఎం జగన్ సంతాపం తెలిపారు . తారకరత్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎంవో ట్వీట్ చేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తారకరత్న మృతిపట్ల  తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గత మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటాడని తాను  భావించానని చెప్పారు. తారకరత్న నటుడిగా రాణిస్తునే ప్రజా జీవితంలో ఉండాలనుకున్నారని తెలిపారు. కానీ ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరమన్నారు. 

జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. లోకేష్‌ తో కలిసి పాదయాత్ర చేస్తుండగా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన ట్రీట్ మెంట్ కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.  అక్కడ చికిత్స పొందుతూ తారకరత్న తుదిశ్వాస విడిచారు.