![చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం](https://static.v6velugu.com/uploads/2021/07/AP-CM-YS-Jagan-Mohan-Reddy-remembers-his-father-on-his-birth-anniversary_DiJdAvPIj6.jpg)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన గురించి తెలియనివారుండరు. అంతలా.. ఆయన తనదైన పాలనతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన అందుబాటులోకి తెచ్చిన, అమలుచేసిన పథకాలు అందుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరిని ఏదో బంధుత్వంతో పిలిచే ఆయన మాట, రూపు, చెరగని చిరునవ్వు అందరికీ ఇంకా గుర్తే. ఆ మహనీయుడి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన తండ్రిని తలచుకుంటూ ఓ ట్వీట్ చేశారు.
‘చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం
మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం
నీ ఆశయాలే నాకు వారసత్వం
ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా...
పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..
జన్మదిన శుభాకాంక్షలు నాన్నా’ అంటూ ట్వీట్ చేశారు.
చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2021
పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం
మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం
నీ ఆశయాలే నాకు వారసత్వం
ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా...
పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..
జన్మదిన శుభాకాంక్షలు నాన్నా.#YSRJayanthi