జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్

ఏపీలో మరోసారి వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టబోతుందన్నారు సీఎం జగన్. విజయవాడలోని ఐప్యాక్  ఉద్యోగులతో సమావేశమయ్యారు జగన్. 2019లో వైఎస్సార్ సీపీ సాధించిన 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈ సారి సాధించబోతున్నామని చెప్పారు. గతంలో కంటే వచ్చే ఐదేళ్లలో ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పారు. 

 వైసీపీకి ఐ ప్యాక్ సూచనలను గత ఐదేళ్ల పాలనలో ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ఈ ప్రయాణం ముందు కూడా ఇలానే కొనసాగుతుందన్నారు.  ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించని ఫలితాలు  వస్తాయన్నారు.   దేశంలో అందరు షాకయ్యేలా జూన 4న ఫలితాలు వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు.  అన్ని రాష్ట్రాల నేతలు ఏపీనే చూస్తారని చెప్పారు.