సీఎం అని కూడా చూడకుండా తిడుతున్నరు

సీఎం అని కూడా చూడకుండా తిడుతున్నరు

ఏపీలో ప్రతిపక్ష నేత టీడీపీ దీక్షలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం వైఎస్ జగన్. సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. గిట్టని మనిషి అధికారంలో ఉంటే చూస్తే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఏపీ పరువు, ప్రతిష్టలను తీస్తూ.... డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇది తన ఒక్కడి మీద జరుగుతున్న దాడి కాదని... ఏపీ ప్రజల మీద దాడని చెప్పారు జగన్. అమరావతిలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు CM జగన్. వాడరాని భాషతో బూతులు తిట్టడంతో వాటిని వినలేక, భరించలేక అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి ఖండిస్తే కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి.. అన్యాయమైన రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.అన్ని ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ఆదరించి ప్రతిపక్షానికి స్థానం లేకుండా చేశారన్నారు. దీంతో ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగతంగా బూతులు తిడుతూ విద్వేషాలు, వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని అన్నారు.