
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వైఎస్సాఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9 గంటలకు జగన్ తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. ఉదయం 11.10 నుంచి 11.30 జేఎస్‌డబ్యూ స్టీల్‌ప్లాంటు భూమి పూజలో పాల్గొంటారు. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు స్టీల్ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40 కి పులివెందుల చేరుకుంటారు. అనంతరం 2.00 – 2.15 పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 2.40 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.