సచివాలయానికి బయలు దేరిన సీఎం చంద్రబాబు.. అడుగడుగునా స్వాగత హోర్డింగులు

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా నిన్న ( జూన్​ 12)న ప్రమాణం చేసిన చంద్రబాబు సచివాలయానికి బయలుదేరారు.  ఉండవల్లి .. వెంకటపాలెం నుంచి మండం మధ్య సీడ్​ యాక్సెస్ రోడ్ లో  సీఎం చంద్రబాబుకు అభిమానులు, టీడీపీ శ్రేణులు, సచివాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.  చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతూ భారీ హోర్డింగ్​లు ఏర్పాటు  చేశారు.  అమరావతి రైతులు మానవ హారంగా ఏర్పడి వివిధ రకాల పులతో స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు సచివాలయానికి తరలి వెళ్తున్నారు.  

యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తారు. ఆయా విద్యాసంస్థల్లో 13 వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా నివేదిక రూపొందించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి, అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుపై రెండో సంతకం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ‍‍ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేయనున్నారు. నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపైనా సంతకాలు పెట్టనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో  ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోనున్నారు. సీఎం  ఛాంబర్​ను సర్వాంగ సుందరంగా అధికారులు తీర్చిదిద్దారు.  అమరావతి చేరుకుంటున్న చంద్రబాబుకు రైతులు ఘన స్వాగతం పలికారు.