కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల భేటీ.. ఎందుకంటే..?

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. మంగళవారం (జవనరి 14) ఢిల్లీ వెళ్లిన షర్మిల.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‎తో సమావేశమయ్యారు. ఏపీలో పార్టీ బలోపేతంపై ఇరువురి నేతలతో ఆమె చర్చించారని తెలిసింది. ఇటీవల సొంత పార్టీ నేతల నుండే షర్మిలకు అసమ్మతి ఎదురు అవుతోంది. ఏపీ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే షర్మిలపై విమర్శలు గుప్పిస్తు్న్నారు. 

షర్మిల ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని కొందరు.. యాక్టివ్‎గా పార్టీ కార్యక్రమాలు  చేపట్టడం లేదని కొందరు.. కేవలం ప్రెస్ మీట్‎లతోనే రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఇంకొందరు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సింది పోయి సోదరుడు జగన్‎తో వ్యక్తిగత వివాదాలకు దిగుతున్నారని ఇంకొందరు షర్మిలను టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ పెద్దలను కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

ALSO READ | సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : నిర్మల్​ఎస్పీ జానకి షర్మిల

అయితే.. షర్మిల ఢిల్లీ టూర్ వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని.. 2025, జనవరి 15వ తేదీన ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఏఐసీసీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉందని.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాల పీసీసీలు, కాంగ్రెస్ పాలిత  రాష్ట్రాల సీఎంలు, ఇతర కీలక నేతలకు ఏఐసీసీ ఆహ్వానం పంపింది. ఇందులో భాగంగానే ఆమె హస్తినా వెళ్లారు.