ఏపీలో 439కి చేరిన క‌రోనా కేసులు..

ఏపీలో 439కి చేరిన క‌రోనా కేసులు..

ఏపీలో మ‌రో ఏడు క‌రోనా కేసులు పెరిగాయి. సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల మ‌ధ్య చేసిన టెస్టుల్లో నెల్లూరులో నాలుగు, గుంటూరులో మూడు పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు ఏపీ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన ఈ ఏడు కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 439కి చేరిన‌ట్లు తెలిపింది. ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు మ‌ర‌ణించ‌గా.. 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయిన‌ట్లు వెల్ల‌డించింది.

రెండు జిల్లాల్లో జీరో కేసులు

జిల్లాల వారీగా చూస్తే ఏపీలో అత్య‌ధికంగా గుంటూరు జిల్లాలో 93 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత క‌ర్నూలు జిల్లాలో 84, నెల్లూరులో 56 కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌కాశం జిల్లా 41, కృష్ణా జిల్లాలో 36, క‌డ‌ప‌లో 31, చిత్తూరులో 23, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 23, విశాఖ‌లో 20, తూర్పు గోదావ‌రి జిల్లాలో 17, అనంత‌పురంలో 15 మందికి క‌రోనా సోకింది. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా లేక‌పోవ‌డం కొంత ఊర‌ట‌నిచ్చే అంశం.