ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 647కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది రాష్ట్ర ఆరోగ్య శాఖ. అత్యధికంగా కర్నూలులో 26 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అనంతపురంలో 3, విశాఖలో 1, కృష్ణాలో 6, పశ్చిమ గోదావరి జిల్లాలో 5, గుంటూరులో 3 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 23 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 647కు చేరగా.. అందులో 17 మంది మరణించారు. చికిత్స పొందిన తర్వాత కోలుకుని ఇప్పటి వరకు 65 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 565 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు.
జిల్లాల వారీగా చూస్తే కరోనా మహమ్మారి కర్నూలులో కల్లోలం సృష్టిస్తోంది. కొన్నాళ్లుగా ప్రతి రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆ జిల్లాల్లో 158 మందికి కరోనా సోకింది. ఆ తర్వాత గుంటూరులో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆ జిల్లాలో 129 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 75, నెల్లూరులో 67 మందికి కరోనా సోకింది. అయితే ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరోనా కేసులు జీరోగా ఉన్నాయి.