
న్యూఢిల్లీ : జింబాబ్వే టూర్‌కు ఎంపికైన ఏపీ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆనందం రెండ్రోజుల్లోనే ఆవిరైంది. గాయం కారణంగా అతను జట్టు కు దూరం అయ్యాడు. నితీశ్ ప్లేస్‌లో ఆల్‌రౌండర్ శివం దూబేను టీమ్‌లోకి తీసుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
నితీశ్ గాయాన్ని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. జులై 6న మొదలయ్యే ఈ టూర్‌లో ఇండియా.. ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.