కర్ణాటక ఫారెస్ట్​ మంత్రికి పవన్ రిక్వెస్ట్​

హైదరాబాద్​:చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించి, ఆస్థి, ప్రాణ నష్టం చేస్తున్న క్రమంలో  ఏనుగుల మందలను తరిమేందుకు, కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను పంపించాలని కర్ణాటక రాష్ట్ర ఫారెస్ట్​మినిస్టర్​ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ కోరారు.  ఈ మేరకు  కర్ణాటక  ప్రభుత్వంతో మాట్లాడేందుకు పవన్ బెంగళూరు వెళ్లారు.  

కర్ణాటక ఫారెస్ట్​ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రేతో భేటీ అయ్యారు.  చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయని, ప్రాణ హాని కలిగిస్తున్నాయని, ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమని బి. ఖంద్రేకు  తెలిపారు. 

ఈ కుంకీ ఏనుగులు  కర్ణాటక అటవీ శాఖ పరిధిలో ఉన్నాయని, కొన్ని కుంకీ ఏనుగులు ఏపీకి ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు.  దీనిపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.