
అమరావతి: తెలంగాణ ప్రజలకు ‘మా తెలంగాణ’ అనే భావన ఉంటుందని, ఆంధ్రులకు ఎప్పుడూ కులాల భావన తప్ప.. ‘మేం ఆంధ్రులం’ అనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్లో కుల భావనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు#PawannKalyan #APAssembly2025 #APpolitics #chandrababu #Janasena pic.twitter.com/0Yeg957c4Z
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) February 25, 2025
అసలు పవన్ కల్యాణ్ ఏమన్నారో ఆయన వ్యాఖ్యలు యథాతథంగా.. ‘‘మా ఆంధ్రప్రదేశ్లో.. తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కు దురదృష్టమో.. ఏంటో.. దౌర్భాగ్యమో తెలియదు ఎప్పుడూ కులాల భావం తప్ప మేం ఆంధ్రులం అనే భావన మాకు లేదు. ఒకేఒక్క చోట ఆంధ్రులం అనే భావన ఎక్కడొస్తుందంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గర మాత్రమే ఆంధ్రులనే భావన వస్తుంది’’.. ఇవీ పవన్ చేసిన వ్యాఖ్యలు.