టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. శనివారం ఏపీలోని రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా తాను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, పొలిటీషియన్ అయినా ఎక్కడినుంచి వచ్చాననే మూలాలు ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగుని పులమడం ఇష్టం లేదని, అందుకే కూటమి ప్రభుత్వానికి మద్దతివ్వని హీరోల సినిమాలకి కూడా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో డిమాండ్ అండ్ సప్లైని బట్టి టికెట్ రేట్స్ పెంచాలి.. బ్లాక్ టికెట్ రూపంలో డబ్బులు ఎవరికో వెళ్లకుండా ఉండేందుకు టికెట్ రేట్ పెంచుతున్నామని స్పష్టం చేశారు. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలిపారు. తెలుగు సినిమా విశ్వవ్యాప్తం అయ్యింది.. ఇకనుంచి టాలీవుడ్ బాలీవుడ్ మాలీవుడ్ అని కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమ అని పిలవాలని అన్నారు. అలాగే హాలీవుడ్ ను ఫాలో అవ్వటం మానేసి మన సంస్కృతిని అనుకరించాలని సూచించారు.
ALSO READ | Gmae Changer: గేమ్ ఛేంజర్ స్టోరీ ఏంటో చెప్పేసిన డైరెక్టర్ శంకర్... వార్ ఉంటుందంట
సినిమాలు తీసేవాళ్ళే సినీపరిశ్రమ గురించి మాట్లాడాలని కానీ సినిమాలు తీయనివారికి ఆ హక్కు లేదని అన్నారు. అలాగే సినిమా తీసేవారితోనే ఎన్డీయే ప్రభుత్వం మాట్లాడుతుందని హీరోలతో దండాలు పెట్టించుకోవాలనే లో లెవెల్ మనుషులం కాదని అన్నారు. ఇక సినిమా టికెట్ రేట్లతో హీరోలకు సంబంధం ఉండదని ఆ అంశంపై మాట్లాడాలంటే యూనియన్లు, నిర్మాతలు రావాలని పేర్కొన్నారు.