ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో ఇబ్బందిపడుతున్నారు. జ్వరం, తీవ్రమైనదగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పవన్ డాక్టర్ల సూచనలు తీసుకుంటున్నారు. పవన్ కుటుంబ సభ్యులు కూడా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు.
అస్వస్థతతో ఉన్నప్పటికీ ; సెప్టెంబర్ 5న ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు పవన్. వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి అన్నారు. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు.
వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న శ్రీ @PawanKalyan గారు
— JanaSena Party (@JanaSenaParty) September 5, 2024
- జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్,… pic.twitter.com/fhYRzs5irp