Pawan Kalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పొలిటికల్ గేమ్ ఛేంజర్..

Pawan Kalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి  చీఫ్ గెస్ట్ గా పొలిటికల్ గేమ్ ఛేంజర్..

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమాని చిత్ర యూనిట్ గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేస్తున్నారు. ఆమధ్య అమెరికాలోని డల్లాస్ లో గ్లోబల్ ఈవెంట్ నిర్వహించగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే చివరి షెడ్యూల్ పూర్తీ చేసుకున్న గేమ్ ఛేంజర్ టీమ్ ఇప్పుడు లోకల్ లో ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. 

ఈ క్రమంలో జనవరి 4న మెగా పవర్ ఈవెంట్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఇందులోభాగంగా ఈ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ మెగా పవర్ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పవన్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో గేమ్ ఛేంజర్ కూడా సూపర్ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సినిమాలకు పెద్దగా సమాయం కేటాయించ లేకపోతున్నాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరాహా చెందుతున్నారు. కానీ గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.