తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష నాయకులతో పాటు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు హైడ్రాపై ప్రశంసలు కురిపించారు. నాగబాబు, డైరెక్టర్ హరీశ్ శంకర్, నటి మధుశాలిని హైడ్రాకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే..
లేటెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రాపై స్పందించారు. హైదరాబాద్ లో హైడ్రా ఏర్పాటు మంచిదేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యలను సమర్థించిన పవన్.. ఆక్రమణల తొలగింపునకు హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమని చెప్పారు. విజయవాడలో వరదలకు బుడమేరు ఆక్రమణలే కారణమన్నారు. బుడమేరు 90 శాతం ఆక్రమణలకు గురైందన్నారు. ప్రభుత్వాలు మారితే వ్యవస్థలు మారకుండా చూడాలన్నారు పవన్ .
ALSO READ | జూబ్లీహిల్స్‌లో బ్లాస్టింగ్‌తో కొండరాళ్ల తొలగింపుపై పిల్
ఏపీకి తన వ్యక్తిగతంగా సెప్టెంబర్ 3న కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్.. ఇవాళ తెలంగాణకు కోటి విరాళం ప్రకటించారు. స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందిస్తానని చెప్పారు.