పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేటోళ్లు పాకిస్తాన్ కి వెళ్లిపోండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేటోళ్లు పాకిస్తాన్ కి వెళ్లిపోండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

పహల్గాం ఉగ్రదాడిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మతం పేరుతో పేర్లు అడిగి మరీ 26 మందిని చంపడం దారుణమని.. అయినా పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని అన్నారు పవన్ కళ్యాణ్. పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడాలనుకుంటే.. పాకిస్తాన్ కే వెళ్లిపోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఒక వ్యక్తిని చంపడమే దారుణమని.. అందులోనూ మతం పేరుతో చంపడం అంతకన్నా దారుణమని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పహల్గాం ఉగ్రదాడి ఘటన దురదృష్టకరమని.. 1986 - 89 మధ్య నాలుగేళ్ళ పాటు తాను కాశ్మీర్ లో ఉన్నానని, ఆ సమయంలో కాశ్మీరీ పండిట్స్ పై అమానుషంగా దాడి జరిగిందని అన్నారు. సుమారు లక్షకు పైగా కాశ్మీరీ పండిట్స్ తమ స్వస్థలాల నుండి తరిమివేయబడ్డారని.. కిరాతకంగా చంపబడ్డారని అన్నారు. ఇప్పుడు జరిగిన పహల్గాం ఉగ్రదాడి దానికి కొనసాగింపుగా భావిస్తున్నానని అన్నారు పవన్ కళ్యాణ్.

 

పహల్గాం ఉగ్రదాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మధుసూధన్ రావు కుటుంబానికి పార్టీ తరపున రూ. 50లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్.