ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా అంటూ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ ..

ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా అంటూ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ ..

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య సినిమాలకి పూర్తిగా బ్రేక్ ఇచ్చి రాజకీయాలపై దృష్టి సారించాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ఎక్కడికివెళ్ళినా సినిమా అప్డేట్లు అడుగుతూ ఇబ్బంది పెడుతన్నారు. అయితే పవన్ కళ్యాణ్ శనివారం గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబును పరామర్శించడానికి కాకినాడకి వెళ్ళాడు. ఈక్రమంలో మీడియా రిపోర్టర్స్ సీరియస్ మ్యాటర్స్ గురించి మాట్లాడుతుంటే సినిమా అప్డేట్స్ గురించి అడిగాడు. ఇక అభిమానులు కూడా ఓజీ.. ఓజీ.. ఓజీ... అంటూ నినాదాలు చేశారు. 

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడేం స్లొగన్స్ ఇవ్వాలో తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. సీరియస్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు సినిమాల గురించి అడుగుతారేంటీ అంటూ  సీరియస్ అయ్యాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే గతంలో కూడా పలుమార్లు బహిరంగసభల్లో రాజకీయాల గురించి ప్రసంగిస్తున్న సమయంలో పవన్ సినిమా పేర్లు పలుకుతూ హంగామా చేశారు. దీంతో అప్పుడు కూడా పవన్ ఎదో చూసీ చూడనట్టు వెళ్లిపోయారు. కానీ ఈమధ్య పవన్ బయట కనిపిస్తే చాలు సమస్యల గురించి కాకుండా సినిమా అప్డేట్లు అడుగుతున్నారు.

Also Read :- తెలంగాణకు తిరుమల షాక్

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగులో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ మొదలైన తర్వాత ఎన్నికలు రావడంతో పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తున్నాడు. కానీ అప్పుడప్పుడు సమయం తీసుకుని  షూటింగ్ షెడ్యూల్స్ లో పాల్గొంటున్నప్పటికీ పూర్తీ స్థాయిలో సమయం ఇవ్వలేకపొతున్నాడు. దీంతో ఈ ఈ సినిమాల రిలీజ్ ఆలస్యం అవుతోంది.