![Pawan Kalyan: సనాతన ధర్మ యాత్రకు బయలుదేరిన పవన్ కళ్యాణ్.. కొచ్చి శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన](https://static.v6velugu.com/uploads/2025/02/ap-deputy-cm-pawan-kalyan-starts-sanatana-dharma-tour_H7SxsPOfnu.jpg)
ఆంధ్రప్రదేశ్ డీప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ తన "సనాతన ధర్మ పరిరక్షణ" మిషన్‌లో భాగంగా కేరళ మరియు తమిళనాడులోని వివిధ పవిత్ర స్థలాలకు తీర్థయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా తమిళనాడులోని పవిత్ర స్థలాలకు ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన తన ప్రయాణంలో శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ క్షేత్ర సందర్శనలో పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుమారుడు అకీరా, టిటిడి సభ్యుడు శ్రీ ఆనందసాయి పాల్గొన్నారు. అలాగే పవన్ దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా అక్కడ ఇతర ముఖ్యమైన దేవాలయాలను సందర్శించనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Deputy Chief Minister and JanaSena President, @PawanKalyan, visited the Sri Agastya Maharshi Temple near Kochi, Kerala. He performed special prayers, accompanied by his son #AkiraNandan and TTD member Anand Sai. pic.twitter.com/NqG70mLh9C
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) February 12, 2025