ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో భాదపడుతున్నారు. దాంతో, ఆయనకు తిరుమలలోని అతిథి గృహంలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు, పవన్ వెన్నునొప్పితోనూ బాధపడుతున్న తెలుస్తోంది. మంగళవారం(అక్టోబర్ 01) రాత్రి కాలి నడకన తిరుమల చేరుకున్న పవన్, బుధవారం(అక్టోబర్ 02) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం బుధవారం రాత్రి తిరుమలలోనే పవన్ బస చేశారు. కాలినడకన మెట్లమార్గం గుండా పయణించే సమయంలోనే పవన్ చాలా అలిసిపోయి కనిపించారు.
ALSO READ : తిరుమలలో పవన్.. చేతిలో ‘వారాహి డిక్లరేషన్’.. ఇంతకీ అందులో ఏముంది..?
మరోవైపు, గురువారం(అక్టోబర్ 03) సాయంత్రం తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలిలో వారాహి బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో వారాహి డిక్లరేషన్ అంశాలను వివరిస్తామని పవన్ ఇప్పటికే ప్రకటించారు. జ్వరంతోనే వారాహి సభలో పవన్ పాల్గొంటారని చెబుతున్న జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు.