కొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు. శనివారం ( 29జూన్ 2024 ) ఉదయం కొండగట్టు చేరుకున్న పవన్ అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన కొండగట్టు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. 

కొండగట్టుకు చేరుకునే మార్గం మధ్యలో పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కు స్వాగతం పలికారు.కొత్తపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ను గజమాలతో సత్కరించారు. పవన్ టూర్ నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.

డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఎన్నికలకు ముందు ముడుపులు కట్టిన పవన్, ఇవాళ ముక్కులు చెల్లించుకున్నారు.పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవటంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.దర్శనం అనంతరం తిరిగి రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరారు పవన్.