బాలీవుడ్ నటి కేసు అంశం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది.ఈ కేసులో పొలిసు ఉన్నతాధికారుల పాత్ర ఉందంటూ వార్తలొస్తున్న క్రమంలో చర్చనీయాంశం అయ్యింది. ఇదే అంశంపై స్పందించిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కమిషనర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాలని అన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే అని, పోలీసుల పాత్ర ఉంటే కచ్చితంగా చర్యలుంటాయని అన్నారు.
అసలేం జరిగిందన్న అంశంపై ఎంక్వైరీ జరుగుతోందని, త్వరలోనే చర్యలుంటాయని అన్నారు. ఈ కేసులో వైసీపీ కీలక నేతల పాత్ర ఉందంటూ అధికార టీడీపీ ఆరోపిస్తున్న క్రమంలో కేసును సీరియస్ గా ఏపీ పొలిసు శాఖ.ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.