కరోనా ఎఫెక్ట్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇకపై స్కూల్స్‌లో ఉదయం పూట ప్రార్థనలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో ఆటలు కూడా నిర్వహించవద్దని ఆదేశించింది. విద్యార్థులు ఒకే చోట గుమికూడకుండా టీచర్లు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. 

పాఠశాల గదులను, ఆవరణను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ఆదేశించింది. జిల్లా విద్యాధికారులు జిల్లా వైద్యాధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండాలని.. విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ కరోనా బారిన పడితే వెంటనే చికిత్స అందించేలా చూడాలని తెలిపింది. మాస్కులు ధరిస్తూ, భౌతికదూరాన్ని పాటించాలని చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కాగా, నిన్న ఒక్క రోజే ఏపీలో కొత్తగా 14 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తల కోసం..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళల్లో మార్పులు

బిడ్జిపై నుంచి పడిన కారు.. ఎమ్మెల్యే కొడుకు సహా ఏడుగురి మృతి

దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు